నిజంగా మెగా ఫ్యామిలీ భయపెడితే..ఇంతమందికి అసలు ఛాన్సులు వచ్చేవా..మంత్రి రోజా..?

పదవులు అనేవి శాశ్వతం కాదు…అనే మాటలు శాశ్వతంగా ఉండిపోతాయి..ఇది చాలామంది చెప్పే మాటే. కానీ వైస్సార్సీపీ పార్టీ లోని కొంతమంది నేతలు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా నోటికి ఎంత వస్తే..అంత నేయడం..అవతలి వ్యక్తి ఏ స్థాయి లో ఉన్నారు..ప్రజల్లో వారికీ ఎంత ప్రజాభిమానం ఉందో అనేది కూడా పట్టించుకోకుండా మాటలు అనేస్తున్నారు. అలాంటి మాటలు అనడం తో మంత్రి రోజా ముందు వరుసలో ఉన్నారు. ఈమె మాటలే ఇప్పుడు పార్టీ కి పెద్ద ముప్పు లా మారిందని సొంత పార్టీ నేతలు , కార్య కర్తలు మాట్లాడుకుంటున్నారు.

రీసెంట్ గా మెగా బ్రదర్స్ ఫై దారుణమైన కామెంట్స్ చేసి అందరి చేత ఛీ..ఛీ అనిపించుకున్న రోజా..ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఫై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. మెగా ఫ్యామిలీలో ఆరేడుగురు హీరోలు ఉన్నారని.. వారు ఇండస్ట్రీని భయపెడుతుంటారని ఆమె పేర్కొన్నారు. ఇటీవల రణస్థలిలో బహిరంగ సభలో జబర్దస్త్ ఫేం హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఇవన్నీ కూడా పవన్ స్వయంగా ఆది చేత చెప్పించారన్నట్లుగా రోజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. వాళ్లు ఎంత? వాళ్ల ప్రాణం ఎంత? వాళ్ల మాటలు వెనుక ఎవరున్నారో తెలీదా? అంటూ రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీని మెగా ఫ్యామిలీ రూల్ చేస్తుందని.. వారి కుటుంబంలో పెద్ద ఎత్తున హీరోలు ఉండటంతో ఇండస్ట్రీని తమ చెప్పు చేతుల్లో ఉంచుకున్నట్లుగా రోజా మాట్లాడారు. మెగా ఫ్యామిలీ మీద ప్రేమ లేదని.. భయం మాత్రమే ఉందంటూ ఆమె చెప్పుకొచ్చింది.

రోజా చేసిన కామెంట్స్ ఫై రాజకీయ విశ్లేషకులు, సినీ విశ్లేషకులు స్పందిస్తున్నారు. నిజంగా రోజా చెప్పినట్లుగా మెగా ఫ్యామిలీ మీద భయమే ఉండి ఉంటే.. అలీ లాంటి చిన్న నటుడు ఇంతలా మాట్లాడతారా..? ఆ మధ్య పోసాని కృష్ణ మురళీ.. థర్టీ ఇయర్స్ పృద్వి తో పాటు మరికొంతమంది అంతలా మాట్లాడేవారా..? అని ప్రశ్నిస్తున్నారు. ఓ మాట అనే ముందు కాస్త ఆలోచించుకొని మాట్లాడాలని రోజా కు హితువు పలుకుతున్నారు. మరి ఇప్పటికైనా అధిష్టానం రోజా ను కంట్రోల్ చేయాలనీ , లేదంటే పార్టీ కి పెద్ద నష్టం రావడం ఖాయమని వైస్సార్సీపీ శ్రేణులు అంటున్నారు.