చంద్రబాబును మేం టార్గెట్ చేయాల్సిన పనిలేదు

అందుకు ఆయన సిగ్గుపడాలి

roja
roja

అమరావతి: కరకట్ట వద్ద ఇల్లు కట్టకూడదనీ, వరద వస్తే మునిగిపోతుందని ఎంతమంది చెప్పినా అప్పటి సిఎం చంద్రబాబు వినిపించుకోలేదని వైఎస్‌ఆర్‌సిపి నేత రోజా తెలిపారు. ఓ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు అక్రమ కట్టడంలో నివసించారనీ, అందుకు ఆయన సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. వరద కారణంగా జరుగుతున్న నష్టం, ముంపు ప్రాంతాలను గుర్తించేందుకు జలవనరుల శాఖ డ్రోన్ ను వాడితే, తన ప్రాణాలు తీయడానికి వాడినట్లు చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును తాము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదనీ, ఇప్పటికే ఏపీ ప్రజలు ఆయన్ను టార్గెట్ చేసి ఇంటికి పంపించారని సెటైర్ వేశారు. టీడీపీ నేతలు వరదలపై చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని రోజా విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిండుకుండల్లా ఉన్న ప్రాజెక్టులను చంద్రబాబు చూడలేకపోతున్నారని రోజా చురకలు అంటించారు.


తాజా స్వస్థ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/