జగన్ ఉన్నంత కాలం బాబు సీఎం కాలేడు..లోకేష్ ఎమ్మెల్యే కాలేడంటూ రోజా కామెంట్స్

జగన్ ఉన్నంత కాలం బాబు సీఎం కాలేడు..లోకేష్ ఎమ్మెల్యే కాలేడంటూ రోజా కామెంట్స్

నారా చంద్రబాబు నాయుడు ఫై నగరి ఎమ్మెల్యే రోజా సంచలన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం చంద్రబాబు వరద బాధిత ప్రాంతాలలో పర్యటిస్తూ..జగన్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరుగుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని తెలిసినప్పటికీ..ప్రభుత్వం అప్రమత్తం కాలేదని అన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు కామెంట్స్ ఫై రోజా ఆగ్రహం వ్యక్తం చేసారు.

వరద బాధితుల దగ్గర అసెంబ్లీలో అనని మాటలు ఎలా చెప్తావని… చంద్రబాబుకు కుప్పం దెబ్బకు పిచ్చెక్కింది..ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏరియల్ సర్వే చేయలేదా…జగన్ ఏరియల్ సర్వేపై విమర్శలు చేస్తారా.. చంద్రబాబు చెప్పేదంతా నమ్ముతారనుకోవడం పొరపాటన్నారు.

సోనియాతో కుమ్మక్కై జగన్ పై తప్పుడు కేసులు పెట్టించావని మండిపడ్డారు. సోనియా గాంధీ నుంచి శంకర్రావు వరకూ ఏమయ్యారో తెలుసుకో… వరదలు మానవ తప్పిదం ఎలా అవుతుందో చెప్పాలి. పుష్కరాల్లో షూటింగ్ కోసం ఎంత మందిని బలి తీసుకున్నావని మండిపడ్డారు. పుష్కరాల తొక్కిసలాట సీసీ ఫుటేజీ బయటపెడితే చంద్రబాబు చిప్పకూడు తినేవాడని .. చంద్రబాబు దొంగ ఏడుపులు ఏడుస్తూ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. జగన్ ఉన్నంతవరకూ నువ్వు ముఖ్యమంత్రి కాలేవు…నీ కొడుకు ఎమ్మెల్యే కాలేడని ఫైనల్ పంచ్ వేసింది.