సుజనా చౌదరిపై రోజా ఆగ్రహం

roja
roja

అమరావతి: బిజెపిలో చేరేందుకు వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు, ఎమ్మెల్యెలు కూడా టచ్‌లో ఉన్నారని ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీఐఐసీ చైర్‌ పర్సన్‌ రోజా తీవ్రంగా స్పందించారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఎక్కడ జైలుకు వెళ్లాల్సి వస్తుందోనని భయపడే సుజనా చౌదరి బిజెపిలో చేరారని ఆరోపించారు. ఎన్నికల్లో టిడిపి నామరుపాల్లేకుండా పోవడంతో కేసులకు భయపడి బిజెపి నాయకుల కాళ్లు పట్టుకుని సుజనా ఆ పార్టీలో చేరారని, ఇప్పుడేం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని మండిపడ్డారు. ఆయనలాగా తమ పార్టీ నేతలు బరితెగించరని, తమ పార్టీ నేతలు బిజెపిలో చేరాల్సిన అవసరం ఏముందో సుజనా చెప్పాలని విమర్శించారు. బ్యాంకులకు రూ.6వేల కోట్లు ఎగ్గొట్టి నీతులు చెబుతున్నారంటూ సుజనా చౌదరి మీద మండిపడ్డారు. బిజెపిలో ఉంటూ టిడిపి ఏజెంటుగా వ్యవహరిస్తున్నారని రోజా ఆరోపించారు. తనలాగే అందరూ తప్పులుచేసి బిజెపిలో చేరతారని సుజనా భావిస్తునట్టుందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/