స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రోహిత్‌కు జరిమానా…

rohit sharma
rohit sharma

మొహాలి: ముంబయి ఇండియన్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. కెఎల్‌ రాహుల్‌ (57బంతుల్లో 6ఫోర్లు, ఒక సిక్సర్‌తో 71 నాటౌట్‌) విధ్వంసకర బ్యాటింగ్‌కు క్రిస్‌గేల్‌ (24బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సులతో 40) తోడవ్వడంతో పంజాబ్‌ జట్టు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని తనఖాతాలో వేసుకుంది. అయితే ముంబయి ఇండియన్స్‌ పరాజయంతో పాటు జరిమానా కూడా పడింది. ఆ జట్టు సారథి రోహిత్‌ శర్మకు యాజమాన్యం రూ.12లక్షల జరిమానా విధించింది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా అతనికి ఫైన్‌ పడింది. ఈ సీజన్‌లో ఒక జట్టుకు జరామానా పడటం ఇదే తొలిసారి.

మరిన్నీ తాక్రీడా జాతియ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/news/sports/