రోహీత్‌ శర్మ సెంచరీ

rohith-sharma
rohith-sharma

రాంఛీ: భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 51 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 205 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ వీరవిహారంతో(108) సెంచరీ చేశాడు. అజింక్య రహానే (74) హాఫ్ సెంచరీ అదరగొడుతున్నారు. ఈ టెస్టు సిరీలో వరసగా రోహిత్ మూడు సెంచరీ చేసి భారత తరఫున రికార్డు సృష్టించాడు. పూజారా పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో రబడా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 12 పరుగులు చేసి నోర్ట్ బౌలింగ్‌లో ఎల్‌బిడబ్ల్యుగా ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ 10 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో ఎల్గర్‌కు క్యాచ్ తొలి వికెట్ రూపంలో మైదానం వీడాడు. నాలుగో వికెట్‌పై రోహిత్, రహానే 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత్ 20తో ముందున్న విషయం తెలిసిందే. రోహిత్ రెండు వేల పరుగుల క్లబ్ లో చేరాడు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/