రోహిత్‌శర్మ ఐపిఎల్‌లో అరుదైన రికార్డు

rohit sharma
rohit sharma

హైదరాబాద్‌: ఐపిఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ అన్నా, నాలుగు ఐపిఎల్‌ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌, ఐదు ట్రోఫీలు గెలిచిన ఐపిఎల్‌ జట్టులో రోహిత్‌ శర్మ సభ్యుడిగా కూడా ఉన్నాడు. టీ20ల్లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీకి తిరుగులేదు. ఉప్పల్‌ వేదికగా ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒక పరుగు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్‌శర్మకు ఇది 10వ ఐపిఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది.
అత్యధిక ఐపిఎల్‌ ఫైనల్స్‌ ఆడిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్‌ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అశ్విన్‌, రోహిత్‌ శర్మ ఇద్దరూ ఇప్పటివరకు 10 ఐపిఎల్‌ ఫైనల్స్‌ ఆడారు. ఇక , ఈ జాబితాలో చెన్నై సూపర్‌కింగ్స్‌కు చెందిన ధోని, సురేశ్‌రైనా(14 ఐపిఎల్‌ ఫైనల్స్‌)తో అగ్రస్థానంలో ఉన్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/