సెంచరీ సాధించిన రోహిత్

భారీ స్కోరు దిశగా టీమిండియా

Rohit-Sharma
Rohit-Sharma

విశాఖ: విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ సత్తా చాటాడు. సెంచరీని సాధించాడు. మొత్తం 154 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 10 ఫోర్లు , 4 సిక్సర్ల సాయంతో శతకొట్టాడు. రోహిత్ సెంచరీ కొట్టడంతో స్టేడియంలోని ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ఈ క్రమంలో రోహిత్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓపెనర్ గా దిగిన తొలి టెస్టు, తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ సాధించాడు. మరో ఎండ్ లో మయాంక్ అగర్వాల్ 76 పరుగులతో (10 ఫోర్లు, 2 సిక్సర్లు) రోహిత్ కు అండగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 179 పరుగులు (55 ఓవర్లు) చేసింది. భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/