పదో స్థానానికి ఎగబాకిన రోహిత్‌…

టాప్‌ 10 ర్యాంకింగ్స్‌లో నలుగురికి భారత బ్యాట్స్‌మెన్స్‌కు చోటు…

rohit sharma
rohit sharma

ముంబయి: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేయడంలో కీలకపాత్ర పోషించిన హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ తాజాగా ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ టాప్‌ లేపాడు. ఏకంగా 12 స్థానాలు ఎగబాకి టాప్‌ 10లో చోటు దక్కించుకున్నాడు. సఫారీలతో జరిగిన చివరి టెస్టుకు ముందు 22వ స్థానంలో ఉన్న రోహిత్‌…రాంచీ టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించడంతో అతడి గ్రాఫ్‌ ఒక్కసారిగా మారిపోయింది. 722పాయింట్లతో పదో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఐసిసి అన్ని ఫార్మట్లలో టాప్‌ 10లో నిలిచిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్‌ మరో రికార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు సారథి విరాట్‌ కోహ్లీ మాత్రమే మూడు ఫార్మట్లలో టాప్‌ 10 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పూణె టెస్టులో డబుల్‌ సెంచరీ మినహా మరో భారీ స్కోర్‌ సాధించని విరాట్‌ కోహ్లీ రెండో స్థానాన్ని కాపాడుకున్నాడు. అయితే అగ్రస్థానంలో కొనసాగుతున్న స్టీవ్‌ స్మిత్‌కు కోహ్లీకి పాయింట్ల (11) వ్యత్యాసం పెరిగింది. ఇక రాంచీ టెస్టులో సెంచరీ సాధించిన వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె ఐదో స్థానానికి చేరుకున్నాడు. మరో టెస్టు బ్యాట్స్‌మెన్‌ చతేశ్వర పుజారా నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/