అమెరికా దౌత్యకార్యాలయంపై రాకెట్‌ దాడి

us embassy
us embassy

బాగ్ధాద్‌: ఇరాక్‌రాజధాని బాగ్ధాద్‌లో అమెరికా దౌత్యకార్యాలయం సమీపంలో రాకెట్‌ దాడి జరిగింది. బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌లో ఈ దాడిజరగడంపై సంకీర్ణ సేనలు కలవరం వ్యక్తంచేస్తున్నాయి. ఇటీవలే సౌదీలోని అతిపెద్ద చమురు కంపెనీపై డ్రోన్లసాయంతో దాడులుజరగడంతో ఇందుకు బాద్యత ఇరాన్‌దేనని బ్రిటన్‌, అమెరికాలు విమర్శించాయి. తాజాగా జరిగిన రాకెట్‌ దాడి అమెరికా,ఇరాన్‌లమధ్య ఉద్రిక్తతలను మరింతపెంచింది. అమెరికా దౌత్యకార్యాలయానికి కిలోమీటరు దూరంలోనే ఈ దాడిజరగడం గమనార్హం. దాడితో ఆప్రాంతంలోని నివాసితులు భయాందోళనలకు లోనయ్యారు. టిగ్రిస్‌ నదవి వెంబడి తీవ్రప్రకంపనలు వచ్చినట్లు చెపుతున్నారు. మేనెల తర్వాత వరుసగా రెండోసారి బాగ్దాద్‌లోని గ్రీన్‌జోన్‌పై దాడులుజరిగినట్లు అంచనా. ఇక్కడే విశాలమైన ప్రాంగణంలోఅమెరికా దౌత్యకార్యాలయం ఉంది. బాగ్దాద్‌లో న్న ఇరాన్‌ మద్దతు ఉ్న మిలీషియాలపనేనని అమెరికా భావిస్తోంది. ఇరాక్‌లో ఉన్న అమెరికా సేనలు తక్షణమే వదిలివెళ్లాలని ఇవి డిమాండ్‌చేస్తున్నాయి. సోమవారం నాటి దాడులు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగాపెంచాయి. ఇరాన్‌ అధీనంలోని మిలీషియాలపై ఇరాక్‌లో ఇటీవల వైమానిక దాడులు పెరిగాయి. దీనికితోడు ఇజ్రాయిల్‌కూడా ఇటీవల పొరుగుననే ఉన్న ఇరాన్‌స్థావనాలు, సిరియాను లక్ష్యంగాచేసుకుని వైమానిక దాడులుచేసింది. అమెరికా ఎంబసీపై జరిగిన దాడిలో ఎలాంటి ప్రాణనష్టంలేదని అధికారులు వెల్లడించారు. బయట పార్కుచేసి ఉంచిన కార్లు మాత్రం ధ్వంసం అయ్యాయని వెల్లడించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/