దేవుళ్ల సొమ్ముకే కన్నాలు!

భారతీయ సంస్కృతికి మారుపేరుగా భక్తి విశ్వాసాలకు నిలయాలుగా ప్రజాదరణ పొంది ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొంది న దేవాలయాలు రానురాను దీనావస్థకు చేరుకుంటు న్నాయి. అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు ఎంతో విలువైన ఆస్తిపాస్తులున్నా నిత్యపూజలకు గతిలేక దీపం పెట్టే దిక్కులేక తెలుగు రాష్ట్రాల్లో వేలాది దేవాలయాలు కళావిహీనంగా మిగిలిపోతున్నాయి. జీర్ణావస్థకు చేరుకుంటు న్నాయి. మరొకపక్క ఆదాయం ఉన్న దేవాలయాల్లో అవినీతి, అవకతవకలు రాజ్యమేలుతున్నాయి.

Police Investigation: Robbers Strike at Temples (file)
Police Investigation: Robbers Strike at Temples (file)

రాజకీయ అవసరాల కోసం దేవ్ఞడిని, దేవాలయాలను, దైవభక్తిని దుర్వినియోగం చేసే దుష్టసంప్రదాయం ఆరంభమైనప్పటి నుంచి దేవాలయ వ్యవస్థ పతనం మొదలైందని చెప్పొచ్చు. పవిత్రమైన హిందూదేవాలయ వ్యవస్థలో పాలకుల జోక్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. గతంలో ఎందరో ధర్మా చార్యులు పీఠాధిపతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. దేవాలయాలపై వచ్చే ఆదాయం దైవప్రచారానికి, ధార్మిక కార్యక్రమాలకు వినియోగించాలని మఠాధిపతులు డిమాండ్‌ చేశారు. గతంలో ఎన్నో విదేశీదాడులు ఎదుర్కొని మరెన్నో ఆటు పోట్లు తట్టుకున్న దేవ్ఞళ్లు ఇప్పుడు స్వజనుల దోపిడీ ల నుంచి దొంగతనాల నుంచి, అవినీతి నుంచి తమను తాము పాడుకోలేకపోతున్నారేమోననిపిస్తున్నది.

ప్రపంచం లోని అగ్రస్థానంలో ఉన్న తిరుపతి వెంకన్న కూడా అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా తిరు మల తిరుపతి దేవస్థానం కోశాగారం నుంచి వెండి కిరీటం, మరో రెండు బంగారు ఉంగరాలు అదృశ్యమైన కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆభరణాలు దొంగ తనం అయినట్టు గుర్తించిన అధికారులు, పాలక మండలి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఏకంగా రికవరీవైపు చర్యలు తీసుకొని చేతులు దులుపుకోవడం విస్మయం కలిగిస్తున్నది. అంతటి కట్టుదిట్టమైన భద్రత, సిసికెమెరాల పటిష్టమైన నిఘా మధ్యఉన్న ట్రెజరీ నుండి ఆ ఆభరణాలు ఎలా బయటకు వెళ్లాయి?బయటి దొంగలా? ఇంటి దొంగలా? తదితర అంశాల జోలికి పోకుండా ట్రెజరీ ఇన్‌ ఛార్జ్‌ అధికారున్ని బాధ్యుణ్ణి చేస్తూ ఆయన జీతం నుండి రికవరీ చేసేందుకు నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నారు.

ఈ నిర్ణయం పాలక మండలి తీసుకున్నదా? లేక కార్యనిర్వ హణ అధికారి తనకు తానుగా నిర్ణయించుకొని చర్యలు చేపట్టారా?అనే విషయంలో స్పష్టతలేదు. అయితే దొంగ తనం జరిగి నట్టు గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన ప్రాథమిక బాధ్యతను విస్మరించారనేచెప్పొచ్చు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఉంటే ఎవరు ఈ దొంగతనానికి పాల్పడ్డారో వారితో చేయికలిపిన వారెవరో బయటకు వచ్చి ఉండేది.

ఏదిఏమైనా ఇప్పుడు వెలుగు చూసినా తర్వాత అందుకు అడుగులు వేస్తున్నారు. కార్యనిర్వహణ అధికారి కానీ, పాలక మండలి కానీ ఎంత నిర్లక్ష్యంగా బాధ్యతారాహి త్యంగా వ్యవహరించారో ఈ సంఘటన చెప్పకనే చెబుతు న్నది. ఇకపోతే దేశరాజధాని ఢిల్లీలో ఉన్న తిరుమల వెంకటేశ్వరునికి చెందిన దేవాలయ కార్యాలయంలో అవకత వకలు జరిగి నాలుగున్నర కోట్ల రూపాయలకుపైగా దేవ్ఞని సొమ్మును స్వాహా చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ మొదలైంది.

ఆ విచారణ పూర్తి అయితేకానీ వాస్తవంగా ఎన్ని కోట్లు అక్రమార్కుల పాలైనాయో ఆ స్వాహాకారులు ఎవరో బయటకు వస్తుంది. ఇక కొత్తగా పాలకమండలి ఛైర్మన్‌ వచ్చినప్పటి నుండి కొన్నికొత్త కార్యక్రమాలు చేపట్టా రు.దర్శనాల్లో మార్పులు తెచ్చారు. ఇక దళారులను గత వారంరోజులుగా గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు అడుగులు వేస్తున్నారు.అక్కడే కాదు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు అన్నీ ఇ

న్నీకావ్ఞ. ఇటీవల దొంగతనాలు కూడా చోటు చేసుకుంటు న్నాయి.రాత్రులే కాదు పట్టపగలు కూడా దేవ్ఞనిసొమ్ములకు కన్నాలు పెడుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడిరంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో నిన్న బుధవారం పూజచేయించుకో వాలని వచ్చిన ఒక ఆగంతకుడు చిల్లర తెమ్మని పూజారిని కోరారు.చిల్లర కోసం పూజారి పక్కకు వెళ్లడంతో అమ్మవారి ముక్కుపుడక, మంగళసూత్రం దొంగలించుకొని వెళ్లిపోయా డు. పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిసికెమెరాల ఆధారంగా పోలీసులు ఆ నకిలీ భక్తుడిని గుర్తించే ప్రయత్నా లు చేస్తున్నారు.

ఇకపోతే దేవాలయ ఆస్తులు ఎంతమంది ఎన్నిరకాలుగా భోంచేశారో లెక్కలకే అందవ్ఞ. ఇంత జరుగు తున్నా దేవ్ఞళ్లను, దేవ్ఞళ్ల ఆస్తులను పరిరక్షించాల్సిన దేవా దాయశాఖ అంతగా శ్రద్ధచూపడం లేదు. అసలు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయ భూములెన్ని?ఎవరి ఆధీనంలో ఉన్నా యి? వాటిపై రావాల్సిన ఆదాయం ఎంత వస్తున్నది? ఇప్పటివరకు దేవాదాయశాఖ వద్ద స్పష్టమైన లెక్కలు లేవనే చెప్పొచ్చు. పాలకులు, అధికారులతో దేవాలయాలకుఇలాంటి ప్రమాదం ఉంటుందని, దేవ్ఞళ్ల ఆస్తులను కాపాడేందుకు భక్తులు సమర్పించుకునే ప్రతిపైసా సద్వినియోగం చేసేం దుకు ఎంతో ముందుచూపుతో మన పెద్దలు ధర్మకర్తల వ్యవస్థను ఏనాడో ఏర్పరిచారు.

ఎలాంటి జీతభత్యాలు లేకుండా,లాభాపేక్ష లేకుండా దేవ్ఞడి సేవలో తరించాలను కునే ఆశయాలున్నవారిని భూవిరాళాలు సమర్పించుకున్న వారిని ధర్మకర్తలుగా నియమించేవారు. వారు ఎంతో నీతి నియమాలు, నియమనిష్టలు, భక్తివిశ్వాసాలు సత్ప్రవర్తనతో ప్రజలకు ఆదర్శనీయంగా అనుకరణీయంగా ఉండేవారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామరాజకీయాలు చోటు చేసుకోవడంతో ఆ ప్రభావం రాజకీయ వ్యవస్థలపై పడింది.

ధర్మకర్తల మండలి రాజకీయ పునరావాసంగా మారిపోయింది. కొందరు ధర్మకర్తలే దేవ్ఞని సొమ్మును భోంచేసి అక్రమాలకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు రావడమేకాదు కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి. తాము భక్తితో సమర్పించుకుంటున్న కానుకలు సద్వినియోగం కావడం లేదని ప్రజల్లో అనుమానాలు ఏర్పడితే పరిస్థితి ఎటువైపు దారితీస్తుందో ఒక్కసారి మనస్సుపెట్టి ఆలోచించాలి.