సైనిక స్టేషన్‌తో పాటు రహదారికి దివంగత బిపిన్‌ రావత్‌ పేరు..!

Bipin Rawat
Bipin Rawat

ఈటానగర్ః ఇండియన్‌ ఆర్మీ తొలి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, దిగవంత జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్మారకార్థం అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబితులోని సైనిక స్టేషన్‌తో పాటు రహదారికి ఆయన పేరును పెట్టారు. చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ (LAC)లోని లోహిత్‌ వ్యాలీలో ఉన్న ఈ సైనిక స్టేషన్‌ను ఇకపై జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్టేషన్‌గా పిలువనున్నారు. అలాగే గ్రామ ప్రధాన రహదారికి సైతం ఆయన పేరును పెట్టారు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

కాగా, కల్నల్‌గా రావత్‌ 1999 నుంచి 2000 వరకు కితిబులోని బెలాలియన్‌ 5/11 గూర్ఖా రైఫిల్స్‌కు నాయకత్వం వహించారు. శనివారం జరిగిన కార్యక్రమంలో కిబితు గ్రామ ప్రధాన రహదారికి అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌ బీడీ మిశ్రా, ముఖ్యమంత్రి పెమా ఖండూ, తూర్పు ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రాణా ప్రతాప్‌ కలిత పేరు పెట్టారు. రావత్‌ కుమార్తెలు కృతిక, తారిణితో పాటు పలువురు సీనియర్‌ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే కిబితు మిలిటరీ క్యాంప్ పేరు జనరల్ బిపిన్ రావత్ మిలిటరీ గారిసన్‌గా మార్చారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/