తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం

29 మంది వలస కార్మికులకు గాయలు..ఇద్దరి పరిస్థితి విషమం

road-accident

హైదరాబాద్‌: తెలంగాణలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో 19 మంది వలస కూలీలు గాయపడ్డారు. కాగా తెలంగాణ నిర్మల్ జిల్లాలోని భాగ్యనగర్‌లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై రెయిలింగ్‌ను ఢీకొట్టి లారీ అదుపు తప్పి పక్కకు బోల్తా కొట్టింది. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు లారీలో 70 మంది వలస కూలీలు ఉన్నారు. వారిలో 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 20 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వలస కూలీలు హైదరాబాద్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్ వెళ్తున్నారు. గాయపడినవారిని దగ్గర్లోని నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ తరలించారు. ఈనేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిచాలని ఆదేశించారు. ప్రమాదం నుంచి తప్పించుకున్న వారిని ఘోరక్‌పూర్ తరలించేందుకు తగిన ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు ఈరోజు ఉదయం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో 23 మంది వలస కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/