తిరుమలలో తప్పిన పెను ప్రమాదం

Tirumala-Road-accident
Tirumala-Road-accident

తిరుమల: ఈరోజు మధ్యాహ్నం తిరుపతి నుండి తిరుమల వెళ్లే కనుమ రహదారిలో పెను ప్రమాదం తప్పింది. అయితే ప్రయాణికులతో వెళ్తున ఆర్టీసీ బస్సు వినాయక స్వామి గుడి దాటిన తర్వాత అదుపుతప్పి కారును ఢీకొట్టి లోయ వైపు దూసుకెళ్లింది. చెట్టుకొమ్మలు, వృక్షాలు అడ్డుగా ఉండటంతో బస్సు రహదారి పిట్టగోడపై నిలిచిపోయింది. అయితే బస్సు కాస్త ముందుకు వెళ్లి ఉంటే మాత్రం పెను ప్రమాదం జరిగేదని ప్రయాణికులు తెలిపారు. చెట్టుకొమ్మలే తమను కాపాడాయని.. పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో పది మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/