ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది కూలీలు దుర్మరణం

road-accident-in-madhya-pradesh

భోపాల్ : మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 40మంది గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. సుమారు 100మంది ప్రయాణికులతో బస్సు ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులంతా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. దీపావళి పండుగ సందర్భంగా వారంతా తమ స్వస్థలాలకు వెళ్తున్నారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.