ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి

పొగమంచు కారణంగానే ప్రమాదం

కోల్‌కతా: పశ్చిబెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున జల్పాయ్‌గురి జిల్లాలోని ధూప్‌గురిలో జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రాళ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రక్కు.. ఆటో, కారును ఢీకొట్టింది. ప్రమాదంలో మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వాహనాలను రోడ్డు పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డావారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను జల్పాయిగుడిలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఓవర్‌లోడ్‌, పొగమంచు కారణంగా ట్రక్కు అదుపు తప్పి పక్కనే వెళ్తున్న వాహనాలపై బోల్తాపడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బండరాళ్లు వాహనాలపై పడడంతో భారీగా దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/