అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి మృతి

road accident
road accident

వాషింగ్టన్‌: అమెరికాలోని టెనస్సీ రాష్ట్రం నాష్‌విల్లే పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టక్కు ఢీకొట్టడంతో ఇద్దరు ఇండియన్స్ దుర్మరణం చెందారు. మృతులు స్టాన్లీ(23), వైభవ్ గోపిశెట్టి(26)గా గుర్తించారు. గోపి శెట్టి తెలుగు విద్యార్థిగా గుర్తించారు. నవంబర్ 28న ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ట్రక్కు డ్రైవర్ డేవిడ్ టోరెన్‌పై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని పోలీసులు తెలిపారు. కాగా అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డేవిడ్‌ టోరెస్‌ అనే వ్యక్తి తన ట్రక్కుతో విద్యార్థులను ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అధీనంలో ఉన్నాడు. నవంబర్‌ 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/