ఘోర రోడ్డు ప్రమాదం ..నలుగురు మృతి

road-accident

గుంటూరు: గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడవైపు వెళ్తన్న కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులను అత్తులూరి బలరాం(25), ఫిరో అహ్మద్‌(35), వింజమూరి హరికృష్ణ(26), మేడసాని వెంకట శ్రీచందు(25)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/