ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఖాసీంపేట జంక్షన్‌లో ఘటన

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
road-accident-at-suryapet

చివ్వెంల: సూర్యాపేట జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ట్యాంకర్‌ను చివ్వెంల మండలం కాసింపేట రోడ్డు జంక్షన్ వద్ద వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సూర్యాపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వైద్య చికిత్స నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుల వివరాలను సేకరిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/