ఘోర రోడ్డు ప్ర‌మాదం, ముగ్గురు మృతి

road accident
road accident


దేవనకొండ: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలినడకన
శ్రీశైలం వెళుతున్న కర్ణాటక భక్తులపైకి కర్నూలు-బళ్లారి రహదారిపై ఓ లారీ దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బళ్లారి
జిల్లా ఎర్రగుడి గ్రామానికి చెందిన 42 మంది భక్తులు ఉగాది సందర్భంగా స్వగ్రామం
నుంచి కాలినడకన శ్రీశైలం బయలుదేరారు. కప్పట్రాళ్ల సమీపంలో బుధవారం ఉదయం
6గంటల సమయంలో ఓ లారీ 8 మంది పాదచారులపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
న‌లుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.సంఘటనా స్థలికి 2 కిలోమీటర్ల దూరంలోని ఈదులదేవరబండ గ్రామస్థులు లారీని అదుపులోకి తీసుకున్నారు. అదే లారీ కప్పట్రాళ్ల స్టేజ్ వద్ద మరో ఇద్దరు పాదచారులపైకి
దూసుకెళ్లడంతో వారు కూడా గాయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని
పరిశీలిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telengana/