ఘోర రోడ్డు ప్రమాదం..పెళ్ళైన 24 గంటలోపే నవ వరుడు మృతి..కోమాలో వధువు

Road Accident
Road Accident

రోడ్డు ప్రమాదాల ఫై ఎన్ని జాగ్రత్తలు చెపుతున్నప్పటికీ ..ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నవ వరుడు మృతి చెందగా..వధువు కోమాలోకి వెళ్ళింది. పెళ్లి జరిగి 24 గంటలు గడవకముందే ఇలా జరగడం ఆ రెండు కుటుంబాలలో విషాదం నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే..

తిరుపతిలో పెళ్లి చేసుకున్న శ్రీనివాస్..తన భార్య ను తీసుకొని అత్తారిల్లు చెన్నైకి కార్ లో బయలు దేరారు. బెంగళూరు సమీపంలో కార్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వరుడు శ్రీనివాస్ మృతి చెందగా..భార్య మాత్రం కోమాలోకి వెళ్ళింది. పెళ్లి కుమారుడు శ్రీనివాస్ కారు నడుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.