కారు, లారీ ఢీ, ఐదుగురు మృతి

శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం

car, lorry accident
car, lorry accident

ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ సమీపంలో ఇన్నోవా కారు, లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. కారు డ్రైవరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్‌ జిల్లా మట్టెవాడ పిఎస్‌లో పనిచేసే హెడ్‌ కానిస్టేబుల్‌ తన కుటుంబంతో కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ వైపు వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం లారీని ఢీకొట్టింది. గ్రానైట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ వే బ్రిడ్జి వద్ద క్రాసింగ్‌ అవుతున్న సమయంలో కారు ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్‌, ఆయన కుమారుడు, బావ, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా..ఆయన భార్య, కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే ఆయన భార్య ప్రాణాలు విడిచారు. కారు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారం. ఈ ప్రమాదంలో కారు నుజ్జయింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/