‘పదవి ఇచ్చినట్లు నాకు తెలియదు’

rk roja
rk roja

అమరావతి: ఏపిఐఐసి చైర్‌పర్సన్‌గా తనను నియమించినట్లు తనకు తెలియదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె మీడియాతో మాట్లాడుతూ..సియం జగన్‌ తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకోవడానికి తనకు ఏ అభ్యంతరం లేదని , ఏబాధ్యతలు అప్పగించినా ఆయనకు పేరు తెస్తానని రోజా అన్నారు.
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏపిఐఐసి ఛైర్మన్‌గా నియమించాలని సియం జగన్‌ నిర్ణయించినట్లు బుధవారం సాయంత్రం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు ఏపిఐఐసి ఛైర్మన్‌గా నియమించినట్లు తనకే తెలియదని రోజా చెప్పడం గమనార్హం.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/