బీహార్‌లో ఆర్జేడి నేతలపై కాల్పులు

firing on rjd leaders
firing on rjd leaders


పాట్నా: బీహార్‌ ముజఫర్‌నగర్‌ జిల్లాలోని కంతిలో దారుణం జరిగింది. రాష్ట్రీయ జనతా దళ్‌(ఆర్జేడి) పార్టీకి చెందిన ఇద్దరు నాయకులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. కాల్పులకు గురైన ఇద్దరు నాయకులను సమీప ఆస్పత్రికి తరలించారు. బాధిత నాయకులలో ఒకరికి రెండు బుల్లెట్‌ గాయాలు కాగా, మరొకరికి నాలుగు బుల్లెట్‌ గాయాలయ్యాయి. వీరి శరీరం నుంచి బుల్లెట్లను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఆర్జేడి నాయకులిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు డాక్టర్లు, కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నిందితులపు త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/