ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఆర్జేడీ పొత్తు

tejashwi yadav
tejashwi yadav

పాట్నా: వచ్చే నెలలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునేందుకు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) చర్చలు జరుపుతున్నట్టు ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు. మంగళవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, పొత్తు విషయమై ఆర్జేడీ ఢిల్లీ ఇన్‌చార్జి మనోజ్ ఝా, ప్రధాన కార్యదర్శి ఖమర్ అలాంలు కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ‘ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే బాగుంటుంది. ఇప్పటికే కేంద్రంలోనూ, బీహార్‌లోనూ మా రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది’ అని తేజస్వి తెలిపారు. గెలిచేందుకు అవకాశమున్న సీట్లలో పోటీ చేయాలని అనుకుంటున్నామని, గౌరవప్రదమైన రీతిలో సీట్ల పంపకాలను ఆర్జేడీ ఆశిస్తోందని ఆయన చెప్పారు. ఢిల్లీలో ఫిబ్రవరి 8న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అదే నెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/