అందం వల్లే ఇబ్బంది పడ్డా

-రియాసేన్‌ వెల్లడి

Riya Sen
Riya Sen

రియాసేన్‌ తన అందంపై తాను ఆసక్తికరమైన కామెంట్స్‌ చేసింది..సుదీర్ఘకాలం నటిగా కొనసాగుతున్న ఈమె ఇప్పటికీ హీరోయిన్‌గా నటిస్తూనే ఉంది.

ఈ అమ్మడు స్కూల్‌లో ఉన్నపటి నుంచే తన అందమైన రూపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొందట.. స్కూల్‌లో కూడ ఎక్కువ మంది ఈ మె అందం గురించి మాట్లాడేవారట..

స్కూల్‌లో ఉన్నపుడే తనకు సెక్సీగా ఉందనే టాగ్‌ పడిందని అందుకే కొన్నిసార్లు ఇబ్బంది పడేదాన్ని అని పేర్కొన్నారామె..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి రియాసేన్‌ మాట్లాడారు..

తనకు కెరీర్‌ ఆరంభం నుంచి వచ్చిన ఇమేజ్‌ విషయంలో సంతృప్తిగా లేనట్టుగా చెప్పుకొచ్చారామె.. కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటిదాకా గ్లామర్‌షో తోనే ప్రేక్షకులను అలరిస్తూ ఉన్న విషయం తెలిసిందే..

అయితే ఈ తరహా ఇమేజ్‌ తెచ్చుకున్న రియా ఇపుడు ఆ ఇమేజ్‌ కారణంగానే ఇబ్బంది పడట్టుగా చెప్పటం హాస్యాస్పదంగా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/