ఆఫ్ఘనిస్థాన్‌లో ఇద్దరు అధ్యక్షులు..ప్రమాణ స్వీకారం

మరోమారు విజయం సాధించిన అష్రఫ్ ఘనీ.. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రత్యర్థి

Afghanistan- Rival 'presidents' hold two inaugurations
Afghanistan- Rival ‘presidents’ hold two inaugurations

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో గతేడాది సెప్టెంబరులో జరిగిన అధ్యక్షుల్లో అష్రాఫ్ ఘనీ విజయం సాధించినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అష్రఫ్‌ ఘని వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు. అధ్యక్ష భవనంలో జరిగిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి అంతర్జాతీయ ప్రతినిధులు పలువురు హాజరయ్యారు. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఘనీ ప్రత్యర్థి అబ్దుల్లా తనదే విజయమని ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో నిన్న ఇద్దరూ వేర్వేరుగా ఎవరికి వారే తమ మద్దతుదారుల మధ్య అధ్యక్షులుగా ప్రమాణం స్వీకారం చేశారు. దీంతో దేశానికి అసలు అధ్యక్షుడెవరో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. పైగా ఈ పరిస్థితులతో తీవ్ర పర్యవసానాలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని ఆఫ్ఘన్‌ వ్యవహారాలపై సీనియర్‌ విశ్లేషకుడు ఆండ్రూ వాకిన్స్‌ వ్యాఖ్యానించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/