రైతు బీమా మరో ఏడాది పొడిగింపు

ఈనెల 14వ తేదీ నుంచి రెండో ఏడాది రైతు బీమా

rithu-bheema
rithu-bheema

హైదరాబాద్ : రైతుబీమా పథకాన్ని మరో ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఒక్కొ రైతుకు రూ.3013.50 ప్రీమియం నిర్ణయించగా, దీనికి కేంద్ర, రాష్ట్ర జిఎస్‌టిలు రూ.542.44గా ఉంది. మొత్తంగా ఒక్క రైతుకు ప్రీమియం కింద రూ.3555.94లు ఎల్‌ఐసికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుంది. గతేడాది కంటే రైతుబీమా ప్రీమియం జిఎస్‌టితో కలిపి రూ.1284.44 అధికం కానుంది. అప్పుడు చేసుకున్న ఒప్పంద ప్రకారం ఒక్క రైతుకు రూ.2271.50 ప్రీమియం చెల్లించారు. గత ఏడాది రైతుబీమా కింద చెల్లించిన పరిహారం, రైతుల మరణాల సంఖ్య, ఇతరత్రా ఖర్చులను పరిగణనలోకి తీసుకున్న ఎల్‌ఐసి ఈసారి ప్రీమియం రేటును పెంచుతున్నట్లు, ఎటువంటి లాభం, నష్టం లేకుండా ఈ పథకం అమలు చేస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి ప్రీమియం రేట్ల ప్రతిపాదనను పంపింది.

వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ సైన్ పూర్తయి 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మొత్తం 30,94,656 మంది రైతులకు ఈ ప్రీమియం రేటును లెక్కగట్టింది. ఒక్కొ రైతుకు ప్రీమియం రూ. 3013.50 లు కాగా, ఇందులో ఎస్‌జిఎస్‌టి 9 శాతం రూ.271.22 కోట్లు, సిజిఎస్‌టి 9 శాతం రూ.271.22 కోట్లు జిస్‌టి కింద చెల్లించనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/