మందగమన కట్టడికి ఉదయ్ కొటక్‌ ఉపాయం

డొమెస్టిక్‌ ఇన్వెస్టర్ల నుండి రిస్క్‌ క్యాపిటల్‌ను ఆహ్వానించాల్సి ఉంది

uday kotak
uday kotak

న్యూఢిల్లీ: మన దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొటక్ మహీంద్రా బ్యాంకు ఎండీ ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు ముందు వృద్ధి రేటు 6 శాతం నుండి 7 శాతం సాధించాలంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్ల నుండి రిస్క్ క్యాపిటల్‌ను మరింత ఆహ్వానించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అలాగే కార్పోరేట్ పాలనలోను పలు మార్పులు తీసుకు రావాలన్నారు. చాలాకాలంగా ఇండియన్ ఇన్వెస్టర్లు ఎక్కువగా రియల్ ఎస్టేట్, బంగారంపై పెట్టుడి పెడుతున్నారని, ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఈక్విటీ వంటి వాటి వైపు మరలుతున్నారని ఉదయ్ కొటక్ అన్నారు. నేటి ఆర్థిక వ్యవస్థ ఈ మార్పును మళ్లీ మార్చాలన్నారు. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు మరింత రిస్క్ కేపిటల్ మార్కెట్లోకి రావాల్సిన అవశ్యకత ఉందన్నారు. మూలధనంపై రాబడి కంటే మూలధనం తిరిగి రావడం చాలా ముఖ్యమని ఉదయ్ కొటక్ అన్నారు. కేవలం ఫారన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్ల (fpi) నుండి మాత్రమే కాకుండా డొమెస్టిక్ ఇన్వెస్టర్ల నుండి కూడా రిస్క్ క్యాపిటల్ రావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే స్టార్టప్స్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ వృద్ధి సాధిస్తాయన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/