పాకిస్తాన్ లో భారీగా పెరిగిన పెట్రోల్‌ ధర

రూ . 234కు ఎగబాకిన లీట‌ర్ ధ‌ర‌

ఇస్లామాబాద్ :పాకిస్తాన్ లో పెట్రోల్ ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నాయి. లీట‌ర్ పెట్రోల్ ఏకంగా రూ 24 పెరిగి రికార్డు స్ధాయిలో రూ 233.89కి ఎగ‌బాకింది. ఇంధ‌న ధ‌ర‌లు మోతెక్క‌డంతో ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. జూన్ 16 నుంచి పెట్రోల్ లీట‌ర్‌కు రూ 233.89, డీజిల్ రూ 263.31, కిరోసిన్ రూ 211.43కు విక్ర‌యిస్తార‌ని మంత్రి ఇస్మాయిల్ పేర్కొన్నారు. గ‌త ప్ర‌భుత్వ పాల‌కులు దేశ ఆర్ధిక ప‌రిస్ధ‌తిని దిగ‌జార్చార‌ని విమ‌ర్శించారు.

పెట్రో ఉత్ప‌త్తుల‌పై మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ స‌బ్సిడీలు ఇవ్వ‌డంతో అప్ప‌టి పాల‌కుల నిర్ణ‌యాల‌తో ప్ర‌స్తుత ప్ర‌భుత్వంపై పెనుభారం ప‌డింద‌ని ఆరోపించారు. లీట‌ర్ పెట్రోల్‌పై పాకిస్తాన్ ప్ర‌భుత్వం రూ 24.03, డీజిల్‌పై రూ 59.16, కిరోసిన్‌పై రూ 39.16 న‌ష్ట‌పోతున్న‌ద‌ని మంత్రి వివ‌రించారు. మేలో ఇంధ‌న స‌బ్సిడీల భారం ప్ర‌భుత్వ వ్య‌యం కంటే మూడు రెట్లు అధికంగా ఉంద‌ని చెప్పుకొచ్చారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/