మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ: మరోసారి పెట్రోల్‌ ధరలు రికార్డు స్థాయికి చేరగా.. తాజాగా చమురు కంపెనీలు మరోసారి ధరలను పెంచాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.‌ తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.86.65, డీజిల్ ధర లీటర్‌కు రూ.76.83కు చేరింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధర సుమారు రూ.14 పెరిగింది.

తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్‌ ధర రూ.90.10, డీజిల్‌ రూ.83.81కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.93.20, డీజిల్ రూ.83.73, కోల్‌కతాలో పెట్రోల్ రూ.88.01, డీజిల్ రూ.80.41, చెన్నైలో పెట్రోల్ రూ.89.13, డీజిల్ రూ.82.04, బెంగళూరులో పెట్రోల్ రూ.89.54, డీజిల్ రూ.81.44, నోయిడాలో పెట్రోల్ రూ.85.91, రూ.77.24, గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.84.72, డీజిల్ రూ.77.39కు చేరాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/