డౌనింగ్‌ స్ట్రీట్‌లో దీపాలు వెలిగించిన బ్రిటన్‌ ఆర్థిక మంత్రి

డౌనింగ్‌ స్ట్రీట్‌లో దీపాలు వెలిగించిన బ్రిటన్‌ ఆర్థిక మంత్రి
rishi-sunak-lights-diya-on-downing-street-in-london

లండన్‌: బ్రిటన్‌ ఆర్థిక మంత్రి, భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ దీపావళి పండుగ సందర్భంగా డౌనింగ్ స్ట్రీట్‌లోని తన అధికారిక నివాసం ముందు దీపాలు వెలిగించారు. దీనికి సంబంధించిన 50 సెకన్ల నిడివి గల వీడియోను ఇండియన్స్ ఇన్ లండన్ గ్రూపు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ చరిత్రలో తొలిసారి డౌనింగ్ స్ట్రీట్‌లో దివాలీ దీపం వెలిగింది. ఇది మనకు ఎంతో గర్వకారణం, హ్యాపీ దీపావళి అంటూ రాసుకోచ్చింది. ఇక డౌనింగ్ స్ట్రీట్ అనేది యూకే ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి అధికారిక నివాసాలను కలిగి ఉంటుంది. మరోవైపు కరోనా నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్‌లో రెండో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/