సిబిఐ కొత్త డెరెక్టర్‌గా రిషికుమార్‌

CBI
Rishi kumar

సిబిఐ కొత్త డెరెక్టర్‌గా రిషికుమార్‌

మధ్యప్రదేశ్‌ మాజీ డిజిపిగా పని చేసిన శుక్లా
ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర సర్కార్‌

న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా కొత్త సిబిఐ డైరెక్టర్‌ నియామకంపై మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ఫ్రభుత్వం ఎట్టకేలకు కేంద్ర దర్యాప్తు సంస్థకు కొత్త బాస్‌ను నియ మించింది. మధ్యప్రదేశ్‌ మాజీ డిజిపి రిషికు మార్‌ను నూతన సిబిఐ డైరెక్టర్‌గా నియ మిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృ త్వంలోని సెలోన్‌ కమిటీ శుక్లాను ఎంపిక చేసింది. శుక్లానియమాకాన్ని కేబినెట్‌ నియా మకాల కమిటీ ఆమోదించింది. శుక్లా రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. శుక్లా గతంలో మధ్యప్రదేశ్‌ డిజిపిగా పనిచేశారు. రిషి కుమార్‌శుక్లా 1983 బ్యాచ్‌కు చెందిన ఐపిఎస్‌ అధికారి. కాంగ్రెస్‌ నాయకుడు మల్లిఖార్జున్‌ ఖర్గే అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. అయితే, ఈపోస్టుకు రేసులో 1984బ్యాచ్‌కు చెందిన అధికారులు జావీద్‌ అహ్మద్‌, రజినీకాంత్‌ మిశ్రా, ఎస్‌ఎస్‌ దేస్వాల్‌లు ఉన్నారు. మధ్యంతర డైరెక్టర్‌ నాగేశ్వరరావు నియమాకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు వెంటనే కొత్త డైరెక్టర్‌ను నియమించాలని ఆదేశించడంతో ప్రధానమంత్రి నేతృత్వంలోని ప్యానెల్‌ రిషికుమార్‌ శుక్లాను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ (సిబిఐ)ను తాత్కాలిక డైరెక్టర్‌తో నడిపించడంపై శుక్రవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించాలని ఆదేశించింది.