రిషి కపూర్ (67) కన్నుమూత
యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి

Mumbai: బాలీవుడ్ మరో దిగ్గజ నటుడిని కోల్పోయింది. బాలీవుడ్ సీనియర్ హీరో, ప్రస్తుత స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ (67) కన్నుమూశారు.
గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న రిషి కపూర్ ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు.
కేన్సర్‌తో పాటు తాజాగా శ్వాస కోస సమస్య కూడా బాధించడంతో రిషి కపూర్‌ను ఆయన సోదరుడు రణ్‌ధీర్ కపూర్ బుధవారం ఉదయం ఆస్పత్రికి తరలించారు.
ఆమెరికాలో కేన్సర్ చికిత్స పూర్తి చేసుకుని గతేడాది సెప్టెంబర్‌లోనే రిషి భారత్‌కు తిరిగి వచ్చారు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రిషి ఈ నెల రెండో తేదీ నుంచి సైలెంట్ అయిపోయారు.
`ది ఇంటెర్న్` హాలీవుడ్ రీమేక్‌లో దీపికతో కలిసి నటించబోతున్నట్టు ఇటీవల రిషి వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/