మండుతున్న పెట్రో, డీజిల్‌

రోజురోజుకీ పెరుగుతున్న ధరలు

PETROL PRICE
PETROL PRICE

ముంబై: దేశీయ ఇంధన ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. పెట్రోల్‌ ధర రూ.26పైసలు, డీజిల్‌ ధర రూ.27పైసలు చొప్పున పైపైకి కదిలాయి. దీంతో హైదరాబాద్‌లో సోమవారం పెట్రోల్‌ ధర రూ.88.37కు చేరగా, డీజిల్‌ ధర రూ.81.99కు చేరింది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.25పైసలు పెరిగి రూ.90.71కి చేరింది. డీజిల్‌ ధర రూ.26పైసలు పెరిగి రూ.83.88కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్‌ ధర రూ.25పైసలు పెరిగి రూ.84.95కు చేరింది. డీజిల్‌ ధర రూ.25పైసలు పెరిగి రూ.75.13కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబైలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్‌ ధర రూ.24పైసలు పెరిగి రూ.91.56కు చేరగా, డీజిల్‌ ధర రూ.27పైసలు పెరిగి రూ. 81.87కు చేరింది. కోల్‌కతాలో రూ.86.39కి చేరింది.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 0.83శాతం తగ్గి 54.64డాలర్లకు పడిపోయింది. ఇక డబ్ల్యూటిఐ క్రూడాయిల్‌ ధర బ్యారెల్‌కు 0.76శాతం తగ్గి 52.02డాలర్లకు తగ్గింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/