తల్లి అయిన రిచా గంగోపాధ్యాయ ..
మగ బిడ్డకు జన్మనిచ్చిన బ్యూటీ

హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ తల్లి అయింది. మే 27న ఆమెకు మగబిడ్డ పుట్టాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. తన బిడ్డకు ‘లుకా షాన్’ అనే పేరు పెట్టామని తెలిపింది.. ‘లుకా షాన్.. నువ్వు మా చిరు నవ్వు. మా బాబు మే 27న జన్మించాడు. వీడి రాకతో మా జీవితాల్లో కొత్త సంతోషాలు వచ్చాయి. లుకా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, రూపురేఖల్లో అచ్చం తన తండ్రిలానే ఉన్నాడు. లుకా.. మా జీవితాల్లో వచ్చినందుకు మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం.’” అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. కెరీర్ పరంగా చూస్తే రిచా ‘మిర్చి’ హిట్ తరువాత నాగార్జునతో ‘భాయ్’ మూవీ చేసింది. తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లి జోనుతో ప్రేమలో పడి, అతనిని వివాహం చేసుకుని గృహిణిగా బాధ్యతల్లో ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/