రాంగోపాల్ వర్మ కొత్త చిత్రం ‘డి-కంపెనీ’ టీజర్

ఇది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్ : రాంగోపాల్ వర్మ

YouTube video


అండర్ వరల్డ్ సినిమాలంటే అందరికీ ముందుగా గుర్చొచ్చేది సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ‘సత్య’ ‘కంపెనీ’ వంటి సినిమాలలో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు వర్మ.

ఇప్పుడు ముంబైకి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘డి-కంపెనీ’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసిన వర్మ.. తాజాగా టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. బిగ్ బీ అమితాబ్ కూడా తన ట్విట్టర్ లో ఈ టీజర్ షేర్ చేయడం విశేషం.
‘డీ కంపెనీ’ టీజర్ చూస్తుంటే ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌ గా అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎలా ఎలా ఎదిగాడన్నది ఇందులో చూపించబోతున్నారు. టీజర్ లో ఎలాంటి డైలాగ్స్‌ లేకుండా కేవలం బీజీఎంతోనే కంపెనీ స్టోరీ ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తూ చివరల్లో చిన్న డైలాగ్‌ చెప్పి ముగించాడు. ఈ సిరీస్ లో 1993 ముంబై బాంబు పేలుళ్ల గురించి.. డి-కంపెనీ నీడలో బ్రతికిన ఇతర గ్యాంగ్‌ స్టర్ల గురించి తెలియజేయనుంది.

‘డీ కంపెనీ’ గ్యాంగ్‌ స్టర్‌ సినిమాలన్నింటికి మదర్‌ లాంటిదని.. ఇది తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. అందుకే ‘డీ కంపెనీ’ సిరీస్ ని మహా భారతంతో పోలుస్తూ దీనికి ‘మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్’ అని క్యాప్షన్‌ పెట్టాడు. ఒక వీధి ముఠాను భయంకరమైన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ గా దావూద్‌ ఎలా మార్చారనేదే ‘డీ కంపెనీ’ కథ అని ఆర్జీవీ పేర్కొన్నారు. స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై స్పార్క్ సాగర్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఐదు భాషల్లో త్వరలోనే ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/