చైతు – సమంతలు తమ డైవోర్స్ ను సెలెబ్రేట్ చేసుకోవాలి – వర్మ

చైతు - సమంతలు తమ డైవోర్స్ ను సెలెబ్రేట్ చేసుకోవాలి - వర్మ

నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అభిమానులు తట్టుకోలేకపోతుంటే..వర్మ మాత్రం వీరిద్దరూ డైవోర్స్ ను సెలెబ్రేట్ చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు.

‘పెళ్లి అనే వాటిని మనం సెలెబ్రేట్ చేసుకోవద్దు.. పెళ్లంటే మంట.. అంటూ ఆర్జీవీ తన స్టైల్లో పోస్ట్ చేశారు. పెళ్లంటే చావు.. విడాకులు అంటూ మళ్లీ జన్మ రావడం అంటూ చెప్పేశాడు. అంటే సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై ఆర్జీవీ ఇలా పరోక్షంగా స్పందిస్తూ.. విడాకులు మంచివే’ అన్నట్టుగా స్పందించాడు.

విడాకుల రూమర్లను నిజం చేస్తూ సమంత నాగ చైతన్య అధికారిక ప్రకటన చేసేశారు. తామిద్దరం ఇక భార్యభర్తలుగా ఉండబోవడం లేదని, కానీ స్నేహితుల్లా ఎప్పటికీ కలిసి ఉంటామని చెప్పుకొచ్చారు. అలా ఆ ఇద్దరూ కూడా ఒకే ప్రెస్ నోట్‌ను షేర్ చేశారు. విడాకుల వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించారు. అలా ఈ ఇద్దరూ అఫీషియల్‌గా ప్రకటించడంతో నెట్టింట్లో చైసామ్ హాట్ టాపిక్‌గా మారారు.

ఈ విడాకుల పై నాగార్జున స్పందించారు.. ‘బరువెక్కిన హృదయంతో ఈ విషయం చెప్తున్నాను.. సామ్-చై మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య మరియు భర్త మధ్య జరిగేది చాలా వ్యక్తిగతమైనది. సామ్ మరియు చై ఇద్దరూ నాకు ప్రియమైనవారు, నా కుటుంబం ఎల్లప్పుడూ సామ్‌తో గడిపిన క్షణాలను ఎంతో ఆదరిస్తుంది మరియు ఆమె ఎల్లప్పుడూ మాకు ప్రియమైనది! దేవుడు వారిద్దరినీ శక్తితో దీవించుగాక అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తాము ఇద్దరు విడిపోతున్నట్లు నాగచైతన్య తన ట్విట్టర్ ద్వారా తెలుపగా.. సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది.