నట్టికుమార్ ఓ సోల్లుగాడు అంటూ వర్మ కౌంటర్..

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కు నిర్మాత నట్టికుమార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న గురువారం వర్మ పుట్టిన రోజు సందర్భాంగా ఆయనపై కోర్ట్ లో కేసు వేసాడు. రామ్ గోపాల్ వర్మ పెద్ద మోసగాడు..తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలి.. ఎప్పుడు డబ్బులు అడిగిన రెస్పాన్స్ లేదని నట్టికుమార్ ఆరోపిస్తూ కోర్ట్ లో కేసు వేసాడు. ప్రతి సినిమాకు 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనలను తుంగలో తొక్కాడని ఆరోపించారు. వర్మ తో 20 సంవత్సరాలు కలిసి పని చేసాను… కొంతమంది బ్రోకర్ల వలన రామ్ గోపాల్ వర్మ తన ప్రతిష్టను దిగజరుచుకుంటున్నాడని నట్టికుమార్ ఆరోపించారు. కోర్ట్ లో కేసు వేయడం తో వర్మ తెరకెక్కించిన డేంజరస్ మూవీ రిలీజ్ కు బ్రేక్ పడింది.

ఈ తరుణంలో నట్టికుమార్ కు వర్మ కౌంటర్ ఇచ్చారు. తనపై నిన్న నట్టి కుమార్‌ చేసిన ఆరోపణలపై ఓ వీడియోను ఆర్జీవీ విడుదల చేశారు. ఈ వీడియోలో వర్మ మాట్లాడుతూ.. నట్టి కుమార్‌ ఓ సోల్లుగాడు, పానకంలో పుడక లాంటోడు అంటూ ఫైర్ అయ్యారు. డేంజరస్ సినిమా వాయిదాకు నట్టి కుమార్‌ కారణం కాదని.. దానికి ఇతరు కారణాలు ఉన్నాయని వర్మ తెలిపాడు. తాను రూ.5 కోట్లు మోసం చేసానని నట్టి చెబుతున్నాడని.. దానిపై లీగల్‌ గా వెళతానంటూ సమాధానం ఇచ్చారు. రెండు రోజుల నుంచి తనను నట్టి కుమార్‌.. డిస్టర్భ్‌ చేస్తున్నాడని.. తన గురించి ఇక మాట్లాడబోనని చెప్పాడు. ఎప్పుడు ప్రెస్‌ మీట్లు పెట్టి.. ఇలాగే… సోల్లు వాగుతాడని నట్టి కుమార్‌ పై ఫైర్‌ అయ్యారు.