వర్మ ఫస్ట్ లవర్..బికినీలో దర్శనం

రామ్ గోపాల్ వర్మ..పరిచయం అవసరం లేని పేరు. నిత్యం వివాదాస్పద కామెంట్స్ తో ..ట్వీట్స్ తో వైరల్ గా మారుతుండడం ఈయన స్టయిల్. అందరు వేరు..నేను వేరు అన్నట్లు ఉంటారు. అందుకే ఈయన నుండి ట్వీట్ పడిందంటే అది అన్ని మీడియాల్లో కవర్ కావాల్సిందే. కేవలం ట్వీట్స్ మాత్రమే కాదు ఏదైనా ఇంటర్వ్యూ కు వెళ్లిన సరే ఆయన్ను ఇంటర్వ్యూ చేసే యాంకర్లు ఒక్కసారిగా పాపులర్ కావాల్సిందే. ఎవరు ఏమనుకుంటారు అనేది ఏమాత్రం ఆలోచించకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తూ..చేయాల్సిన ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.

తాజాగా తన ఫస్ట్ లవర్ ఈమె అంటూ ఓ పిక్ పోస్ట్ చేసి వైరల్ గా మారారు.ఆమె పేరు సత్య అని, విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న సమయంలో తామిద్దరం లవర్స్ అని.. ప్రస్తుతం ఆమె యూఎస్‌లో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తుందని తెలిపారు. ఈయన పోస్ట్ చేసిన పిక్ లో ఆమె స్విమ్ సూట్ లో కనిపించింది. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.

The woman in blue swim suit is SATYA ..She was my 1st ever Love in my college days at Siddhardha engineering college Vijayawada.. @polavarapusatya is currently in the US practising Maternal Fetal medicine specialist and OB Gyn pic.twitter.com/UjsnhEGhwY— Ram Gopal Varma (@RGVzoomin) August 25, 2021