చంద్రబాబు ఫై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..టీడీపీ అధినేత చంద్రబాబు ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని… ఆయనకు సొంత పబ్లిసిటీనే ముఖ్యమని, చంద్రబాబు కానుకల పేరుతో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు పిలిచారంటూ ఘాటైన వ్యాఖ్యలే చేసారు వర్మ. రీసెంట్ గా చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాట చోటుచేసుకొని దాదాపు 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. కందుకూరు, గుంటూరు లలో ఈ ఘటన లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల పట్ల వైస్సార్సీపీ నేతలు పలు విమర్శలు చేస్తూ..ఇప్పుడు ఏకంగా కొత్త జీవో నే తీసుకొచ్చారు. రోడ్ షోస్ , ర్యాలీ లు , పర్యటన లకు అనుమతి లేదని , పర్మిషన్ తీసుకొనే జరపాలని , అది కూడా పోలీసులు తెలిపిన చోటనే జరపాలని ఆదేశాలు జారీచేశారు.

ఈ ఘటన పట్ల చంద్రబాబు ఫై వర్మ ఘాటైన వ్యాఖ్యలు చేసారు. కందుకూరు సంగతి పక్కన పెడితే గుంటూరు ఘటనపై తనకు ఉన్న మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాను అన్నారు. ఎక్కువమంది జనాలు పెద్ద గ్రౌండ్‌లో పెడితే రారని.. పాపులారిటీ తగ్గిపోతుందని అందరికి తెలిసిపోతుందనే భయంతో ఇలా చేశారని చెప్పుకొచ్చారు. చిన్న ప్రాంతాల్లో సమావేశాలు పెడితే బాగా కనిపిస్తుందని.. వచ్చినవాళ్లకు చంద్రబాబు కానుకల పేరుతో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు పిలిచారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హిట్లర్, ముస్సోలిని తర్వాత అలాంటి వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. తన కోసం ఇంత మంది వచ్చి ప్రాణాలు కూడా కోల్పోయారంటూ చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటారని చెప్పారు. ప్రజలకు చంద్రన్న కానుకలు అంటూ బిస్కెట్లు వేసి వారి ప్రాణాలు బలిగొన్నారని దుయ్యబట్టారు. చంద్రబాబును తొలిసారి మీరు అని కాకుండా నువ్వు అని సంబోధిస్తున్నానని చెప్పారు. మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తికి సభలు ఎక్కడ పెట్టాలో తెలియదా? అని వర్మ ప్రశ్నించారు.