పవన్ ‘వారాహి’ ఫై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసుకున్న వారాహి ఫై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ను స్వామి వివేకానందతో పోల్చిన వర్మ… అలాంటి పవన్ కళ్యాణ్.. హిట్లర్ వ్యాన్ మీద నుంచి మాట్లాడుతున్నాడు అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు.

పవన్ కుడికాలిని హిట్లర్ నాకుతాడని.. ఎడమ కాలిని స్వామి వివేకానంద నాకుతాడని అలాంటి పవర్ కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ రోజుల్లో రామారావు గారు “చైతన్య రథం” మీద తిరిగితే, మీరు”పంది బస్సు” మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్ కింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్గా కుదరకపోతే కనీసం కేసులన్నా పెట్టించండి పవన్ గారూ, ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం అంటూ వర్మ ట్వీట్ చేశారు.

వర్మ ట్వీట్స్ ఫై జనసేన కార్య కర్తలు , అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటె పవన్ కళ్యాణ్ నిన్న మంగళవారం వారాహి వాహనానికి కొండగట్టు ఆలయంలో పూజలు చేసారు. ఈరోజు విజయవాడ కనకదుర్గ ఆలయంలో పూజలు నిర్వహించారు.