బిల్ గేట్స్ విడాకులపై వర్మ ఏమన్నాడంటే?

ప్రపంచంలోని ధనవంతుల్లో తనకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న బిల్ గేట్స్ నిత్యం ఏదో ఒక వార్తలో నిలుస్తుంటాడు. కాగా తాజాగా ఆయన తన భార్య మెలిందా గేట్స్‌కు విడాకులు ఇవ్వడంతో మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. తమ 27 సంవత్సరాల వైవాహిక జీవితానికి తాజాగా బిల్ గేట్స్ దంపతులు ఫుల్ స్టాప్ పెట్టడం ప్రస్తుతం ప్రపంచ దృష్టిని తమవైపుకు తిప్పుకుంది.

అయితే బిల్ గేట్స్ విడాకుల గురించి సోషల్ మీడియాలో చాలా చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సైతం బిల్ గేట్స్ విడాకులపై కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తనదైన మార్క్ కామెంట్‌తో నెటిజన్ల దృష్టిని ఆకట్టుకున్నాడు. కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

‘వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా వచ్చే తలనొప్పి ఇదే. భార్యాభర్తలు ఒకరికొకరు తలనొప్పిగా మారితే ఇలానే జరుగుతుందని’ వర్మ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా వర్మ మరోసారి తనదైన మార్క్ కామెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నాడు. ఇక బిల్ గేట్స్ విడాకుల అంశంపై ఇప్పటికే సోషల్ మీడియాలో పలు మీమ్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.