అమిత్ షా కు రేవంత్ బహిరంగ లేఖ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ..కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు బహిరంగ లేఖ రాసారు. తొమ్మిది ప్రశ్నలతో కూడిన లేఖను అమిత్ షా కు రాయడం జరిగింది. కెసిఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటి అని ప్రశ్నించారు. పంట కొనుగోలు చేయకుండా ఆడిన రాజకీయ డ్రామా లో.. ధాన్యం రైతుల మరణాలకు బాధితులు ఎవరు అని నిలదీశారు. పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడిన… మోడీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

నిజామాబాద్ లో పసుపు బోర్డు అంటూ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాత చెందిన భద్రాద్రి రాముడికి.. రామాయణం సర్క్యూట్ లో చోటు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అయోధ్య రాముడు… భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒకటి కాదా ? అని నిప్పులు చెరిగారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా.. తెలంగాణకు ఏముఖం పెట్టుకుని వస్తారని లేఖలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.

ఇక కొద్దీ సేపటి క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో అడుగు పెట్టారు. బేగంపేట విమానాశ్రయానికి ఆయన ప్రత్యేక విమానంలో వచ్చారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు, బీజేపీ నేతలు డీకే అరుణ, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, మురళీధర్ రావు తదితర నేతలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.