తాలిబన్లతో చర్చలకు రంగం సిద్ధం

ఈనెల29న తాలిబన్‌ ప్రతినిధులకు, అఫ్ఘాన్‌ అధికారులకు మధ్య చర్చలు

Mike Pompeo
Mike Pompeo

వాషింగ్టన్‌ : తాలిబన్‌ ప్రతినిధులకు, అఫ్ఘాన్‌ అధికారులకు మధ్య చర్చల పునరుద్ధరణ కోసం రంగం సిద్ధం చేసినట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో తెలిపారు. ఈనెల29న తాలిబన్‌ ప్రతినిధులకు, అఫ్ఘాన్‌ అధికారులకు మధ్య చర్చలు తిరిగి ప్రారంభించనున్నట్టు తెలిపారు. కాగా, అఫ్ఘాన్‌లో కొన్నేండ్ల నుంచి అంతర్యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భద్రతా బలగాలకు, తాలిబన్లకు మధ్య జరుగుతున్న భీకరపోరులో వేలాది మంది సామాన్య పౌరులు మృతిచెందారు. తాలిబన్ల డిమాండ్లపై అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ స్పందించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా బలగాలను, పౌరులను లక్ష్యంగా చేసుకొని తాలిబన్లు మెరుపుదాడులకు దిగుతున్నారు. అమెరికా సంకీర్ణదళాలు అఫ్ఘాన్‌ సైన్యానికి సహకరిస్తున్నాయి. ఇరువర్గాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/