కేంద్ర మహిళా, శిశు సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష

woman--and-child -development
woman–and-child -development

హైదరాబాద్‌: కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పథకాల అమలుపై ఆ శాఖ కార్యదర్శి రవీంద్ర పవార్‌ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పథకాల అమలుపై సీఎస్ స్పందిస్తూ.. గ్రామస్థాయిలో వివిధ శాఖల మధ్య సమన్వయం వల్ల సత్ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో తెలంగాణ ఫుడ్స్ తయారు చేసిన బాలామృతాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా అంగన్వాడీల్లో పిల్లల హాజరు నమోదు చేసేందుకు కొత్త విధానం వాడాలన్నారు. అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎస్ తెలిపారు. కేంద్ర కార్యదర్శి రవీంద్ర పవార్ మాట్లాడుతూ.. పీఎం మాతృవందన యోజనలాంటి పథకాల అమలు తీరును సమీక్షించినట్లు చెప్పారు. పోషణ అభియాన్‌కు సంబంధించి శిక్షణా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. మరిన్ని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాల్సిందిగా పేర్కొన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి పాల్గొన్నారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/