కడప జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

పటిష్టమైన బందోబస్తు చర్యలకై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఆదేశం

State Election Commissioner Nimmagadda Ramesh Kumar with the media
State Election Commissioner Nimmagadda Ramesh Kumar with the media

kadapa: పంచాయితీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ స‌మీక్ష నిర్వ‌హించారు.. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు-2021 సన్నద్ధత, నిర్వహణలపై జ‌రిగిన ఈ స‌మీక్ష‌లో జిల్లాలో ఎన్నికల నిర్వహణపై తీసుకున్న చర్యలు, ఎన్నికల ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.హరికిరణ్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కు వివ‌రించారు.

.అలాగే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు 2021 నిర్వహణకు సంబంధించి భద్రతా, బందోబస్తు పరంగా తీసుకున్న చర్యలు, ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, అక్కడ ఏర్పాటు చేసిన పటిష్టమైన బందోబస్తు చర్యలు, నామినేషన్లు, పోలింగ్, కౌటింగ్ లకు బందోబస్తు ఏర్పాట్లు తదితరాలపై పవర్ పాయింట్ ద్వారా జిల్లా ఎస్పీ కెకెఎన్ అన్బు రాజన్ వివ‌రించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/