కెసిఆర్‌ నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారు

Revanth Reddy
Revanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతున్న సందర్భంగా కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతు.. రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌ పాలన రాచరికానికి పరాకాష్ఠగా మారిందని ఆయన ఎద్దెవా చేశారు. నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని మండిపడ్డారు. సమ్మె విషయంలో మంత్రివర్గంలో చీలిక వచ్చిందని అన్నారు. కెసిఆర్‌ పాలనలో రాష్ట్రం సాధించింది కేవలం రూ.2.5 లక్షల కోట్ల అప్పు మాత్రమేనని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో కెసిఆర్‌ నియంతృత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/