అధికారాన్ని నిలబెట్టుకునేందుకే కాంగ్రెస్‌ నేతలపై దాడులు

Revanth Reddy
Revanth Reddy

Hyderabad:  మళ్లి అధికారాన్ని నిలబెట్టుకునేందుకే కాంగ్రెస్‌ నేతలపై దాడులు చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. ఈరోజిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ అభద్రతా భావనకు గురవుతున్నారన్నారు. ప్రసారమాధ్యమాల్లో వచ్చిన కథనాలపై తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ భయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగా దాడులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. తనకు అండగా నిలిచిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జగ్గారెడ్డి, గండ్ర వెంకటరమణరెడ్డి, కూన శ్రీశైలం సహా తనపై కుట్రలు చేశారన్నారు.