కేంద్ర మంత్రికి రేవంత్‌ రెడ్డి లేఖ

తన నియోజకవర్గ ప్రజలు ఇబ్బందిపడుతున్నారన్న రేవంత్ రెడ్డి

MP Revanth Reddy
MP Revanth Reddy

హైదరాబాద్‌: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఎంపి రేవంత్‌ రెడ్డి తన నియోజకవర్గ పరిస్థితులపై లేఖ రాశారు. ఆర్మీ వర్గాల ప్రాబల్యం ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో సాధారణ పౌరులు వెళ్లేందుకు వీల్లేకుండా రోడ్లు మూసేశారని ఫిర్యాదు చేశారు. ఈ విధంగా దాదాపు 20 రోడ్లను మూసేశారని ఆరోపించారు. దీని వల్ల తన నియోజకవర్గ ప్రజలు సుమారు 10 లక్షల మంది ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారని, దయచేసి రోడ్లు తెరిపించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక మిలిటరీ అధికారులను ఆదేశించాలని కోరారు. అంతేకాదు, ఆ రోడ్లను తెరవాలంటూ గతంలో కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల ప్రతులను కూడా రేవంత్ రెడ్డి తన లేఖకు జతచేశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/